శ్రీవారిపై ప్రమాణం చేయడానికి మీరు సిద్ధమా?: జగన్ కు లోకేశ్ సవాల్

వివేకా హత్యతో తనకు సంబంధం లేదని శ్రీవారిపై ప్రమాణం చేశానన్న లోకేశ్

lokesh

అమరావతిః బ్రహ్మోత్సవాల సందర్భంగా సిఎం జగన్‌ ఈరోజు తిరుమలకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌పై టిడిపి నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. వైయస్ వివేకానంద హత్యతో తనకు కానీ, తన కుటుంబానికి కానీ సంబంధం లేదని 14-4-21న కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేశానని లోకేశ్ చెప్పారు. మీ బాబాయ్ హత్యతో మీకు, మీ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమా జగన్ రెడ్డి? అని ప్రశ్నించారు. తిరుమలకు వెళ్తున్న మీరు శ్రీవారిపై ప్రమాణం చేస్తారా? లేక బాబాయ్ పై గొడ్డలి పోటు జగనాసుర రక్త చరిత్ర అని ఒప్పుకుంటారా? అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు తోడుగా అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/