ప్రచారంలో బిజీగా లోకేశ్‌

nara lokesh
nara lokesh


మంగళగిరి: గుంటూరుజిల్లా మంగళగిరిలో ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అందరినీ ఆప్యాయంగి పలకరిస్తూ ఓట్లను కోరారు. చేనేత కార్మికుల కష్టాలు, వారికి ఉన్న ఇబ్బందులను లోకేశ్‌కు స్థానికులు వివరించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇదే పని చేస్తున్నా.. తమ జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదని తెలిపారు. త్వరలోనే చేనేత కార్మికుల కష్టాలు తీరేలా చర్యలు తీసుకుంటామని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/