జనసేన పార్టీ ఆఫీస్ లో నారా లోకేష్..షాక్ లో పార్టీ కార్యకర్తలు

nara lokesh
nara lokesh

టీడీపీ యువనేత, మాజీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌… జ‌న‌సేన పార్టీ కార్యాలయంలో దర్శనం ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారు. గురువారం గుంటూరు జిల్లా కుంచ‌న ప‌ల్లిలో నారా లోకేష్ ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా నారా లోకేష్‌ కుంచ‌న ప‌ల్లిలో ఉన్న జ‌న‌సేన పార్టీ కల్యాలయానికి వెళ్లారు. పార్టీ కార్యాల‌యంలోకి వెళ్లిన నారా లోకేష్‌ జ‌న‌సేన పార్టీ నేత‌లు, కార్య క‌ర్త‌ల‌తో మాట్లాడారు.

అభివృద్ధి ప‌నులు, పార్టీ విష‌యాల‌ను వారితో నారా లోకేష్ చ‌ర్చించిన‌ట్లు తెలుస్తుంది. టీడీపీ పార్టీ ఉండ‌గా… జ‌న‌సేన పార్టీ కార్యాల‌యానికి నారా లోకేష్ ఎందుకు వెళ్లాడ‌ని అంద‌రిలోనూ… ఓ సందేహం వ‌స్తుంది. ఇక అటు మొద‌టి నుంచి జ‌న‌సేన పార్టీ, తెలుగు దేశం పార్టీలు రెండు ఒక్క‌టేన‌ని వైసీపీ పార్టీ చెబుతూనే వ‌స్తుంది. ఇలాంటి త‌రుణంలో.. నారా లోకేష్ జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలోకి వెళ్లడంతో పెద్ద చర్చకు దారితీసింది.

ప్రస్తుతం మంళగిరి నియోజకవర్గంలో పర్యటనలో ఉన్న లోకేష్..బుధువారం దుగ్గిరాలలో నేతలు, కేడర్‌తో కలిసి స్థానికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఆప్తులను కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను ఓదార్చి వారికి పార్టీ అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. ఒక్క చాన్స్‌ ఇవ్వండి… అంతా మార్చేస్తానన్న వ్యక్తి.. అందరి జీవితాలనూ భారంగా మార్చేశారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే 100 రోజుల్లో 59 లక్షల మందికి పసుపు, కుంకుమ, బట్టలు పెట్టి మరీ పట్టాలిస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్ అవగాహన లేకుంటే.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకి అవగాహన ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల్లో తిరగాలన్నారు. చంద్రబాబు హయాంలో ఇసుకను ఉచితంగా ఇచ్చారని.. ఇప్పుడు పరిస్థితి ఏంటో అందరికీ తెలుసన్నారు.