నాని కొత్త సినిమాకు కోల్ కతా నేపథ్యం

కీలక సన్నివేశాల చిత్రీకరణకు భారీ సెట్

Hero Nani
Hero Nani

స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ హీరో నానితో కొద్దినెలల క్రితం ఓ మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘టాక్సీ వాలా’ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఈ మూవీ నిర్మాణంలో ఉంది .

శ్యామ్ సింగ రాయ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నాని 27వ చిత్రంగా తెరకెక్కనుంది. కాగా ఈ మూవీకి సంబందించిన ఓ ఆసక్తికర విషయంలో ఇప్పుడు బయటికి వచ్చింది.

ఈ మూవీ పీరియాడిక్ కంటెంట్ తో తెరకెక్కనున్న ఫిక్షనల్ డ్రామా అట. కథానేపధ్యాన్నీ, అనుసరించి ఓ భారీ సెట్ అవసరమైనదట.

ఒకప్పటి కోల్ కతా నగరాన్ని తలపించేలా ఓ భారీ సెట్ వేయనున్నారని సమాచారం.

శ్యామ్ సింగరాయ్ మూవీకి సంబందించిన కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ ఈ సెట్ లోనే చిత్రీకరించనున్నారని తెలుస్తుంది.

ఇక నాని నటించిన వి మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా, దర్శకుడు శివ నిర్వాణతో ఒక చిత్రం, మరో నూతన దర్శకుడితో మరో చిత్రం నాని ప్రకటించారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/