చడీచప్పుడు లేకుండా వస్తున్న నాని సినిమా!

నేచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘వి’ ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించగా, ఇందులో మరో యంగ్ హీరో సుధీర్ బాబు నటించాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్లకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా కరోనా కారణంగా ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు.

అయితే తాజాగా ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇక ఇటీవల థియేటర్లు తెరుచుకోవడం, పైగా కొత్త సంవత్సరం కూడా రావడంతో జనవరి 1న ఈ సినిమాను నేరుగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

మరి ఇప్పటికే ఓటీటీలో ‘వి’ చిత్రాన్ని చూసేసిన జనం ఇప్పుడు థియేటర్లకు వచ్చి ఈ సినిమాను చూస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ‘వి’ చిత్రం థియేటర్లలో రిలీజ్ కావడం ఇప్పుడు నిజంగా విచిత్రమే అంటున్నారు అభిమానులు. ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అదితి రావు హైదరీలు హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే.