‘మినీ మహానాడు రద్దు’ పై కొడాలి నాని సెటైర్లు చంద్రబాబుకు ప్రకృతి కూడా సహకరించదు

గుడివాడ‌లో టీడీపీ నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన మినీ మ‌హానాడు వాయిదా ప‌డింది. ఈ తరుణంలో వైసీపీ మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సెటైర్లు వేశారు. చంద్రబాబుకు ప్రకృతి కూడా సహకరించదు అంటూ కామెంట్స్ చేసారు. మంగ‌ళ‌వారం మధ్యాహ్నం మ‌హానాడు నిర్వ‌హించనున్న వేదిక‌ను ప‌రిశీలించిన టీడీపీ నేత‌లు… మినీ మ‌హానాడును వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌కటించారు. గుడివాడ‌లో సోమవారం నుంచి భారీ వ‌ర్షం కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌లితంగా మ‌హానాడు వేదిక మొత్తం బుర‌ద‌మ‌యంగా మారిపోయింది. ఈ నేప‌థ్యంలో ఆ ప్రాంతంలో మ‌హానాడు నిర్వ‌హ‌ణ సాధ్యం కాద‌ని తేల్చిన టీడీపీ నేత‌లు మినీ మ‌హానాడును వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తిరిగి మినీ మ‌హానాడును ఎప్పుడు నిర్వ‌హించ‌నున్న విష‌యంపై త్వ‌ర‌లోనే పార్టీ నుంచి ప్ర‌క‌ట‌న రానుంది.

టీడీపీ మినీ మహానాడు రద్దుపై కొడాలి నాని సెటైర్స్‌ వేశారు. ‘చంద్రబాబుకు ప్రకృతి కూడా సహకరించదు. ఎవరైనా చిన్న కర్మ చేసిన తర్వాత పెద్ద కర్మ చేస్తారు. మహానాడు తర్వాత మినీ మహానాడు చేయడం చంద్రబాబు తెలివి తక్కువ తనానికి నిదర్శనం. చంద్రబాబు సాంప్రదాయాలు పాటించడం తెలుసుకోవాలని కొడాలి నాని సూచించారు. అలాగే నా చిన్నప్పటి నుంచి గుడివాడలో నన్ను ఓడిస్తానని చంద్రబాబు సవాళ్లు విసురుతూనే ఉన్నాడని నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్‌ కలిసొచ్చినా తనను ఏమీ చేయలేరని అన్నారు. సొంత కొడుకునే గెలిపించలేని అసమర్థుడు చంద్రబాబు అన్నారు. తాను పుట్టిన సొంత నియోజకవర్గంలోనే పార్టీని గెలిపించలేని పనికిమాలిన నాయకుడు చంద్రబాబు అంటూ కొడాలి నాని ఫైర్‌ అయ్యారు.