వర్మ కు స్పెషల్ లంచ్ ఏర్పాటు చేసిన పేర్ని నాని

Ram Gopal Varma today met Minister Perni Nani

డైరెక్టర్ వర్మ..ఈరోజు ఏపీ మంత్రి పేర్ని నాని తో సినిమా టికెట్స్ ధరల విషయమై భేటీ అయినా సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వర్మ కోసం నాని స్పెషల్ లంచ్ ఏర్పటు చేసారు.రొయ్యల కూర, మటన్, చికెన్ ప్లెయిన్‌ బిర్యానీతో భోజన ఏర్పాట్లు చేశారు. లంచ్ తరువాత ఇద్దరి మధ్య తిరిగి చర్చలు మొదలయ్యాయి. ఉదయం విజయవాడ ఎయిర్‌ పోర్టు నుంచి నేరుగా సచివాలయానికి చేరుకున్న వర్మ… మంత్రి పేర్ని నానితో సమావేశం అయ్యారు. సినిమా టిక్కెట్ల ఎపిసోడ్, టాలీవుడ్ పరిశ్రమ సమస్యలపై ఈ సమావేశంలో మంత్రి పేర్నితో వర్మ మాట్లాడుతున్నారు.

ఈ భేటీకి ముందు వర్మ vs వైసీపీ సర్కార్ గా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో టికెట్ ధరలను అమాంతం తగ్గించడం పట్ల వర్మ వైసీపీ సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. వరుస ట్వీట్స్ , పలు చానెల్స్ లలో డిబేట్ లలో పాల్గొనడం ..ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించడం వంటివి చేస్తూ వచ్చారు. దాదాపు వారం కు పైగానే వర్మ టికెట్ ధరల ఫై పోరాటం చేసారు. ఆర్జీవీ వరుస ట్వీట్లు, మంత్రి పేర్ని నాని రియాక్షన్ ట్వీట్ల నేపధ్యంలో భేటీ పై ఆసక్తి పెరిగింది. తాను ఓ సినిమా పెద్దగా మంత్రి పేర్ని నాని వద్దకు రాలేదని… కానీ.. ఒక సినిమా కు చెందిన వ్యక్తిగానే ఏపీకి వచ్చానని చెప్పారు. మంత్రి పేర్ని నానితో మాట్లాడిన అనంతరమే… ఈ వివాదంపై మాట్లాడుతానని ఆర్జీవీ పేర్కొన్నారు. మరి వర్మ నాని తో ఏమాట్లాడారనేది కాసేపట్లో తెలుస్తుంది.