నాని ‘దసరా ‘ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..?

నాని , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్నమాస్ ఎంటర్టైనర్ ‘దసరా’. నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మార్చి 30 న పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ కార్య క్రమాలపై దృష్టి సారించారు మేకర్స్. ఇప్పటికే సినిమాలోని పలు సాంగ్స్ రిలీజ్ చేసి ఆకట్టుకోగా..తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. దసరా ట్రైలర్‌ను మార్చి 14న రిలీజ్‌ చేస్తున్నట్లు తెలుపుతూ ఓ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసారు.

ఈ పోస్టర్ లో కాలిపోతున్న రావణాసురుడి బొమ్మ ముందు రెండు గొడ్డల్లు పట్టుకుని ఉన్న నాని కనిపిస్తున్నాడు. టీజర్‌తో భారీ సంచలనం సృష్టించిన దసరా.. ట్రైలర్‌తో ఇంకెంత విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా రికార్డు స్థాయిలో బిజినెస్‌ జరిగిందని. టాలీవుడ్‌లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం దసరా సినిమాకు అన్ని హక్కులకు కలిపి రూ.80 కోట్ల వరకు బిజినెస్‌ జరిగిందని అంటున్నారు..