దసరా క్లైమాక్స్ చూస్తుంటే రోమాలు నిక్క పొడుస్తాయట..

నేచురల్ స్టార్ నాని , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ ‘దసరా’. నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మార్చి 30 న పాన్ ఇండియా గా పలు భాషల్లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో సినిమా తాలూకా ఒక్కో విషయం బయటకు వస్తూ సినిమా ఫై మరింత ఆసక్తి పెంచేస్తున్నాయి. ఈ సినిమాలో 17 నుంచి 18 నిమిషాల పాటు క్లైమాక్స్ సీన్ ఉండబోతోందట. ఈ సీన్ చూస్తున్నంతసేపు ప్రతీ ఒక్కరికీ రోమాలు నిక్క పొడుస్తాయట. ఆ రేంజ్ లో క్లైమాక్స్ ఉండబోతుందని అంటున్నారు. క్లైమాక్స్ సీన్ తో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుందని చిత్రబృందం చెబుతోంది. సినిమా మొత్తానికి ఈ సీన్ హైలెట్ గా నిలవబోతుందట.

అలాగే ఇటీవలే విడుదలైన చమ్కీల అంగీలేసి పాట కూడా నెట్టింటిని షేక్ చేస్తోంది. సినిమా టీజర్ పాటలు ట్రైలర్లు… చిత్రంపై భారీ అంచనాలు రేకెత్తిస్తున్నాయి. నాని కీర్తి సురేష్ లు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి సముద్రఖని సాయి కుమార్ వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు. సత్యం సూర్య సినిమాటోగ్రఫీ నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీగా బడ్జెట్ పెట్టి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు.