కొడాలి నాని కి పోటీగా టీడీపీ నందమూరి చైతన్య కృష్ణ ను బరిలోకి దింపుతుందా..?

రాబోయే ఎన్నికలను టీడీపీ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ముఖ్యంగా గుడివాడ లో కొడాలి నాని ని ఒడియాలని చూస్తుంది. నానికి ధీటుగా పలువుర్ని అనుకున్నప్పటికీ , చివరకు నందమూరి ఫ్యామిలీ నుండి వ్యక్తిని బరిలోకి దింపాలని డిసైడ్ అయ్యినట్లు తెలుస్తుంది.

గుడివాడ నుంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా నందమూరి చైతన్య కృష్ణ బరిలో దింపబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ. కొద్ది నెలల క్రితం చంద్రబాబు తన సతీమణి పైన వైస్సార్సీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో వైస్సార్సీపీ నేతలు లక్ష్యంగా నందమూరి చైతన్య కృష్ణ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.

తాజాగా సినీ రంగంలో ప్రవేశించిన చైతన్య కృష్ణ కు బాబాయ్ బాలయ్య పూర్తి మద్దతు ప్రకటించారు. బసవతారకం క్రియేషన్స్ పతాకం పైన చైతన్య కృష్ణ సినిమా నిర్మాణం జరుగుతోంది. దీంతో, నందమూరి వారసుడే గుడివాడ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగితే పార్టీ శ్రేణులంతా అక్కడ కొడాలి నానికి వ్యతిరేకంగా కలిసి కట్టుగా పని చేస్తాయని టీడీపీ అధినాయకత్వం అంచనా వేస్తోంది. మరి నానికి దీటుగా చైతన్య కృష్ణ నిల్చుంటాడా..లేదా అనేది చూడాలి.