బాలకృష్ణకు హిందూపురంలో చేదు అనుభవం

హిందూపురంలో కాన్వాయ్‌ను అడ్డుకున్న స్థానికులు

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna

హిందూపురం: ప్రముఖ సినీనటుడు, టిడిపి ఎమ్మెల్యె నందమూరి బాలకృష్ణకు తన సొంత నియోజక వర్గం హిందూపురం‌లో చేదు అనుభవం ఎదురైంది. ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్న స్థానికులు… అధికార వికేంద్రీకరణకు అడ్డుపడుతున్నారంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాయలసీమలో హైకోర్టును బాలకృష్ణ అడ్డుకుంటున్నారంటూ వైఎస్‌ఆర్‌సిపి నేతలు, కార్యకర్తలు విమర్శలు గుప్పించారు. ఆయనను రాయలసీమ ద్రోహి అంట, వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. టిడిపి కార్యకర్తలు బాలకృష్ణకు మద్దతుగా నిలిచారు. వైఎస్‌ఆర్‌సి కార్యకర్తలను పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/