నేడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ కేసుల్లో తుదితీర్పు

9 ఏళ్ల క్రితం నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో రెచ్చగొట్టేలా ప్రసంగం

హైదరాబాద్: మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్‌పై నమోదైన కేసుల్లో నేడు తుది తీర్పు వెల్లడి కానుంది. ద్వేషపూరిత ప్రసంగానికి సంబంధించిన 2012 కేసుల్లో తీర్పును నాంపల్లి ప్రత్యేక సెషన్స్ కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. పదేళ్ల క్రితం నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో అక్బరుద్దీన్ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ ముగిసింది. ఇందులో భాగంగా 30 మందికిపైగా సాక్షులను కోర్టు విచారించింది. అలాగే, ఆ ప్రసంగంలోని గొంతు అక్బరుద్దీన్‌దేనని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా ఇప్పటికే నిర్ధారించింది. విచారణ ముగిసిన నేపథ్యంలో కోర్టు నేడు తుది తీర్పు వెలవరించనుంది. తీర్పు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పాతబస్తీలో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/