ఏపీ సీఎం జ‌గ‌న్‌కు నాంపల్లి కోర్టు స‌మ‌న్లు

హైదరాబాద్ : సీఎం జగన్ కు హైద‌రాబాద్‌, నాంప‌ల్లిలోని ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టు స‌మ‌న్లు పంపింది. విచార‌ణ నిమిత్తం ఈ నెల 28న న్యాయ‌స్థానం ముందు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. 2014లో తెలంగాణ‌లోని హుజూర్ న‌గ‌ర్‌లో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఉల్లంఘించార‌న్న అభియోగంపై ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టు విచార‌ణ జ‌రుపుతోంది. కాగా, 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీతో పాటు తెలంగాణ‌లోనూ పోటీ చేసిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలోనే హుజూర్‌న‌గ‌ర్‌లో ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ఉల్లంఘ‌న జ‌రిగింద‌ని ఆరోప‌ణలు వ‌చ్చాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/