టిడిపికి ‘నామా’ రాజీనామా

nama nageswararao
nama nageswararao


హైదరాబాద్‌: టిడిపి సీనియర్‌ నేత, పొలిట్‌ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు ఆ పార్టీని వీడారు. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి, పొలిట్‌ బ్యూరో సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి తరఫున నామా పోటీ చేశారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజ§్‌ుకుమార్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలో టిడిపికి మనుగడ లేదని భావించిన ఆయన అటు కాంగ్రెస్‌లో గానీ, టిఆర్‌ఎస్‌లో గాని చేరేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఆయన టిడిపి అధినేత కేసిఆర్‌, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్‌తోనూ భేటి అయ్యారు. దీంతో టిఆర్‌ఎస్‌లో చేరిక ఖాయమని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు ఖమ్మం ఎంపిగా ఆయనను బరిలోకి దింపాలని టిఆర్‌ఎస్‌ యోచిస్తుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/