నల్గొండ లో రికార్డు ధర పలికిన గణేష్ లడ్డు

నల్గొండ లోని హనుమాన్ నగర్ ఒకటో నంబర్ గణేశ్ లడ్డునూ వేలం నిర్వహించగా రికార్డు ధర పలికింది. రూ.11 లక్షల రూపాయలకు వేమ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి దక్కించుకున్నారు. గణేష్ నవరాత్రుల్లో లడ్డు అనేది చాల ప్రత్యేకమైంది..విశేషమైనది. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న ఈ లడ్డు చాల మహిమగలది. అందుకే ఈ లడ్డు ను దక్కించుకునేందుకు భక్తులు పోటీపడతారు. లక్షలు పెట్టి మరి వేలంపాటలో లడ్డును దక్కించుకుంటారు. గణేష్ లడ్డు వేలంపాటలో బాలాపూర్ లడ్డు చాల విశేషమైనది. ఇక్కడ లక్షల్లో లడ్డు ధర పలుకుతుంటుంది. ఈ ఏడాది ఏకంగా రూ.24.60 లక్షలు పలికింది. పొంగులేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి ఈ లడ్డూను దక్కించుకున్నారు.

ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని హనుమాన్ నగర్ లో జరిగిన శోభాయాత్రలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. కాగా.. హనుమాన్ నగర్ ఒకటో నంబర్ గణేశ్ లడ్డునూ వేలం నిర్వహించగా రికార్డు ధర పలికింది. రూ.11 లక్షల రూపాయలకు వేమ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి అధికారులు పాల్గొన్నారు.