వైఎస్‌ఆర్‌సిపి ఊహల్లో విహరిస్తుంది..

nakka anand babu
nakka anand babu


అమరావతి: టిడిపి పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని టిడిపి నేత ఆనందబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైఎస్‌ఆర్‌సిపి ఊహల్లో విహరిస్తుందని, జగన్‌ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల నిర్వహణలో ఈసి విఫలమైందని విమర్శించారు. వైఎస్‌ఆర్‌సిపి ఫిర్యాదు చేసిన నిమిషాల్లోనే ఈసి చర్యలు తీసుకుందని, అదే ఓట్ల గల్లంతుపై టిడిపి ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం స్పందించలేదని ఆయన ఆరోపించారు. కేంద్రం చెప్పుచేతల్లో ఎన్నికల కమీషన్‌ పనిచేస్తుందన్నారు. ఈసి పనితీరుపై సియం చంద్రబాబు దేశ వ్యాప్త పోరాటం చేస్తున్నారని ఆనంద్‌బాబు వ్యాఖ్యానించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/