డిప్యూటి సిఎం పదవికి నైనా పేరు పరిశీలిన

డిప్యూటి సిఎం పదవికి నైనా పేరు పరిశీలిన
naina-chautala – dushyant

చండీగఢ్‌: బిజెపికి మద్దతిచ్చి హరియాణాలో జన్‌నాయక్‌ జనతా పార్టీ ఉపముఖ్యమంత్రి పదవి కైవశం చేసుకుంది. ఈ కారణంగా నూతన పేరును తెరపైకి తీసుకువచ్చింది. పార్టీ అధ్యక్షుడు దుష్యంత్‌ చౌతాలా ఉపముఖ్యమంత్రి అవుతారని అందరూ భావిస్తుండగా కొత్తగా ఆయన తల్లి నైనా చౌతాలాకు ఆ పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. జెజెపి వర్గాలు డిప్యూటి సిఎం పదవికి నైనా పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో ఐఎన్‌ఎల్‌డీ నుండి ఆమె శాసన సభకు ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఎన్నికల్లో నైనా బాధ్రా అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపోందారు. బిజెపి 40 సీట్లను హరియాణాలో గెలుచుకున్న సందర్భంగా జెజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమౌతుంది. నిన్న రెండు పార్టీల మద్య కుదిరిన ఒప్పందంలో జెజెపికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని వార్తలు వినిపిస్తున్నాయి. నాటినుండి దుష్యంత్‌ చౌతాలనే ఉపముఖ్యమంత్రి అధికారాన్ని చేసిక్కించుకుంటారని తెలుసుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/