నాగార్జునసాగ‌ర్‌ 14 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగ‌ర్‌ 14 గేట్లు ఎత్తివేత
Nagarjunasagar 14 gates lifted

హైదరాబాద్‌: నాగార్జునసాగ‌ర్ ప్రాజెక్టుకు వ‌ర‌ద ప్ర‌వాహం ఉద్రిత్తగా కొన‌సాగుతున్న‌ది. దీంతో అధికారులు ప్రాజెక్టు 14 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 1,57,388 క్యూసెక్కుల నీరు వ‌స్తుండ‌గా అంతే మొత్తంలో నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 312.04 టీఎంసీలు. భారీగా నీరు వ‌చ్చిచేరుతుండ‌టంతో ప్ర‌స్తుతం 311.74 టీఎంసీల నీరు ఉన్న‌ది. సాగ‌ర్ పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 590 అడుగులు కాగా, ఇప్పుడు 589.90 అడుగుల మేర నీరున్న‌ది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/