నాగార్జునసాగర్‌ నుంచి నీటివిడుదల

18 గేట్లు ఎత్తివేత

Nagarjuna Sagar
Nagarjuna Sagar

Vijayapuri South (Guntur District) : నాగార్జునసాగర్‌ 18 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది.

ప్రాజెక్టు అధికారులు ఎప్పటికప్పుడు నీటి ఉధృతిని అంచనా వేస్తూ 18 క్రస్ట్‌గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు.

ఎగువ జలాశయమైన శ్రీశైలం నుండి నాగార్జునసాగర్‌ జలాశయానికి 3లక్షలకు పైగా ఇన్‌ఫ్లో రావటంతో ప్రాజెక్టు అధికారులు క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం నాగార్జునసాగర్‌ జలాశయం నీటిమట్టం 589.00 అడుగుల వద్ద ఉంది.

ఇది 309.0570 టి.యంసిలకు సమానం. కుడికాలువ ద్వారా 7678, క్రస్ట్‌గేట్ల ద్వారా 266670 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 28785 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఎడమ కాలువ ద్వారా, యస్‌యల్‌బీసి, యల్‌యల్‌సి ద్వారా నీటి విడుదల ఆగిపోయింది. మొత్తం అవుట్‌ఫ్లోగా 3,03,133 క్యూసెక్కులనీరు విడుదలవుతుంది.

ఎగువ జలాశయమైన శ్రీశైలం నుండి సాగర్‌ జలాశయానికి ఇన్‌ఫ్లోగా 3,03,133 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/