నాగార్జున సాగర్ 14 గేట్ల ఎత్తివేత

సాగర్‌కు కొనసాగుతున్న వరద

nagarjuna-sagar

నల్లొండ: ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు 14 గేట్లను అధికారులు నిన్న ఎత్తారు. అల్మట్టి నుంచి శ్రీశైలం వరకూ రిజర్వాయర్లు పూర్తి వరద నీటితో కళకళలాడుతుండడం వల్ల, దిగువకు నీటిని వదలడంతో, సాగర్ మరోసారి నిండిపోయింది. దీంతో గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తిన అధికారులు, వచ్చిన నీటిని వచ్చినట్టు వదులుతున్నారు. దీంతో ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు ఈ ఉదయం నల్గొండ, గుంటూరు జిల్లాలకు చెందిన వందలాది మంది పర్యాటకులు ప్రాజెక్టు వద్దకు రావడంతో, ఇక్కడ సందడి నెలకొంది. నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.4 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.90 అడుగులు (311.74) టీఎంసీలుగా ఉంది. కాగా, దిగువన ఉన్న పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ లో సైతం నీరు నిండుగా ఉండటంతో దాదాపు 3 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వెళుతోంది.


తాజా ఏపి వార్తల కోసం కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/