నాగార్జున సాగర్‌ 10 గేట్లు ఎత్తివేత

Nagarjunasagar
Nagarjunasagar

నాగార్జున సాగర్ : నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు జలాశయం పది క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండగా ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 1.90 లక్షల క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 1.98 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి సామర్ధ్యం 589.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలుకాగా ప్రస్తుతం 311.74 టీఎంసీలుగా ఉంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/