వలస కార్మికులకు నాగలాండ్‌ ఆఫర్‌

రూ. 10 వేలు ఇస్తాం.. రాష్ట్రానికి రావొద్దు

migrant-workers

కొహిమా: ఇతర రాష్ట్రాలకు పనుల కోసం వెళ్లిన తమ రాష్ట్ర కూలీలు ప్రస్తుత పరిస్థితుల్లో తిరిగి రావొద్దని నాగాలాండ్ ప్రభుత్వం కీలక  ప్రకటన చేసింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారు ఇప్పుడప్పుడే రావొద్దని, వారందరికీ రూ. 10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన దాదాపు 18 వేల మంది నాగాలాండ్‌ కూలీలు పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే, క్వారంటైన్‌ సదుపాయాలు, కరోనా పరీక్షలు చేసే కేంద్రాలు తగిన న్ని లేకపోవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కూలీలను తిరిగి రావద్దని కోరుతోంది.

వలస కార్మికుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నాగాలాండ్ కరోనా రహిత రాష్ట్రంగా ఉంది. ఈ నేపథ్యంలో వలస కూలీలు తిరిగి వస్తే కరోనా ఎక్కడ వ్యాప్తి చెందుతుందోనన్న ఆందోళనతో ఎక్కడి వారు అక్కడే ఉండేలా ఖర్చులు, ఇతర అవసరాల కోసం రూ. 10 వేల ఆర్థిక సాయం ప్రకటించింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/