రాంబాబు గారూ..ఈ కంగారేంటండీ – నాగబాబు

జనసేన పార్టీ నేత , మెగా బ్రదర్ నాగబాబు ..వైస్సార్సీపీ మంత్రి అంబటి రాంబాబు ఫై కామెంట్స్ చేసారు. ప్రతిదానికీ ఈ కంగారేంటండీ రాంబాబు గారూ అంటూ తనదైన స్టయిల్ లో సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కిన సంగతి తెలిసిందే. వైస్సార్సీపీ పార్టీ ఆత్మకూరు ఉపఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయ డంఖా మోగించాలని సన్నాహాలు చేస్తుంది. ఇక ఈ ఎన్నికలకు దూరంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు..ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్త టూర్ లో బిజీ అయ్యారు. ఇక జనసేన అధినేత రాజకీయాలు , సినిమాలతో బిజీ గా ఉన్నారు.

ఈ తరుణంలో వైస్సార్సీపీ మంత్రి అంబటి రాంబాబు జనసేన ఫై కామెంట్స్ చేసారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీకి జనసేన మద్దతు ఉందా? లేదా? అని ప్రశ్నించారు. స్పష్టంగా చెప్పకపోయారా… రాజకీయంగా తుడిచిపెట్టుకుపోతారు అని హెచ్చరించారు. రాంబాబు కామెంట్స్ ఫై నాగబాబు స్పందించారు. ‘అయినా ప్రతిదానికీ ఆ కంగారేంటండీ రాంబాబు గారూ’ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ‘రాంబాబు గారూ… మిమ్మల్ని చూస్తుంటే జబర్దస్త్ బిల్డప్ బాబాయ్ గెటప్ శీను గాడు గుర్తొస్తున్నాడు సుమీ’ అంటూ ఎద్దేవా చేశారు. ‘అయినా ఈ శాపనార్థాలేంటండీ బాబూ… మీరూ, అపరిపక్వత కాకపోతేనూ’ అంటూ నాగబాటు ట్విట్టర్ వేదికగా విమర్శించారు.