నాగశౌర్య 24 వ మూవీ విశేషాలు

వరుస సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్న నాగశౌర్య ..తన 24 మూవీకి సిద్ధమయ్యారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి కథ, దర్శకత్వం ఎస్‌ఎస్‌ అరుణాచలం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం నాగ శౌర్య తన మేకోవర్ కూడా మార్చుకునే పనిలో పడ్డాడట.

ఫిలిమ్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్‌ నంబర్‌ 1గా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస రావు చింతలపూడి, విజయ్ కుమార్‌ చింతలపూడి, డాక్టర్ అశోక్‌ కుమార్‌ చింతలపూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం జరగనుందట. నాగశౌర్య ప్రస్తుతం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, నారి నారి నడుమ మురారి, పోలీస్‌ వారి హెచ్చరిక సినిమాలు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి.