క్యూట్ కపుల్ కేరాఫ్ ఫ్లైట్!

Naga Chaitanya , Samanta Relax mood
Naga Chaitanya , Samanta Relax mood

గత కొన్నిరోజులుగా ప్యాక్డ్ షెడ్యూల్స్ తోనూ.. ‘మజిలీ’ ప్రమోషన్స్ తోనూ బిజీగా ఉండడంతో చై-సమ్ లకు ఫ్రీ టైం దొరకడం లేదు.  కానీ ఒకే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ చేస్తుండడంతో జోడీగానే కలిసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.  ఇంత హాడావుడిలో కూడా సమంతా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది.  ‘మజిలీ’ ని ప్రశంసించినవారికి థ్యాంక్స్ చెప్పడంతో పాటుగా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంది.   తాజాగా సమంతా తన ఇన్స్టాగ్రామ్ ద్వా ఒక  ఫోటో ను పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలో చై-సామ్ జంట విమానంలో జర్నీ చేస్తున్నారు.  చైతు లాప్ టాప్ లో ఏదో చూస్తూ ఉండగా.. చైతు భుజంపై తలవాల్చిన సమంతా నిద్రలోకి జారుకుంది. ఈ ఫోటోను చూస్తే చాలు ఎందుకు చై-సామ్ ను క్యూట్ కపుల్ అంటారో మనకు తెలుస్తుంది.  అంత బ్యూటిఫుల్ గా ఉంది ఫోటో.

ఈ ఫోటోకు “ఆఖరికి.. ఏదీ పెద్ద విషయం కాదు” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  దీనికి చాలామంది నెటిజనులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు.  ఒక నెటిజనుడు “అవును..  లవ్.. కేర్ తప్ప మిగతావేవీ పెద్ద విషయాలు కాదు” అన్నాడు. ఇలానే చాలామంది క్యూట్ కపుల్ అని.. బ్యూటిఫుల్ కపుల్ అని ప్రశంసించారు కానీ ఒక వ్యక్తి మాత్రం “స్ట్రెయిట్ గా కూర్చోండి. ఎలక్ట్రానిక్ పరికారాలను ఆఫ్ చేయండి.. ల్యాండింగ్ కు ముందు ట్రే టేబుల్ ను క్లోజ్ చేయండి” అంటూ జాగ్రత్తలు చెప్పాడు.  అందరూ ఆ ఫోటోలో బ్యూటీని చూస్తే ఈయనకు మాత్రం రూల్స్ గుర్తొస్తున్నాయే… మూసేసిన కింగ్ ఫిషర్ లో పనిచేసిన ఉద్యోగి అయి ఉండొచ్చు