చైతు కొత్త చిత్ర టైటిల్ ‘ కస్టడీ ‘

నాగ చైతన్య 22 వ చిత్రానికి ‘కస్టడీ ‘ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. నాగ చైతన్య – కృతి శెట్టి జంటగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో NC22 పేరిట ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ లో ప్రియమణి తో పాటు పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ తరుణంలో వారి పాత్రల తాలూకా ఫస్ట్ లుక్ లు రిలీజ్ చేస్తూ సినిమా ఫై ఆసక్తి నింపుతున్నారు.

ఇప్పటికే పలువురి ఫస్ట్ లుక్ లు రిలీజ్ చేసిన మేకర్స్..బుధువారం సినిమా టైటిల్ ను ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ సినిమా కు కస్టడీ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఇందులో పోలీస్ గెటప్ లో ఉన్న నాగచైతన్య ను కొందరు పోలీసులు గన్నులు గురి పెట్టి అతన్ని బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ మూవీ లో చైతన్య ఒక పోలీస్ గా కనిపిస్తున్నారు.