నాగార్జున సూపర్ మాస్ సాంగ్ ను రీమిక్స్

NAG, NAGA CHAITANYA
NAG, NAGA CHAITANYA

నాగార్జున కెరీర్ లో ఒన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయిన “అల్లరి అల్లుడు” చిత్రంలోని “నిన్ను రోడ్డు మీద చూసినాది లగ్గాయిత్తు” అనే సాంగ్ ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాస్ సాంగ్ ను యువసామ్రాట్ నాగచైతన్య తన తాజా చిత్రం “సవ్యసాచి”లో రీమిక్స్ చేస్తున్నాడు. “శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం” చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకొన్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. “నిన్ని రోడ్డు మీద చూసినాది లగ్గాయిత్తు” రీమిక్స్ లో చైతూతో ఓ అగ్ర కథానాయకి ఈ పాటలో చిందేయనుంది. ఆమె ఎవరన్నది త్వరలోనే వెల్లడించనున్నారు దర్శకనిర్మాతలు. ఒరిజినల్ వెర్షన్ ను కంపోజ్ చేసిన కీరవారి ఈ రీమిక్స్ వెర్షన్ కి కూడా సంగీత దర్శకులు అవ్వడం విశేషం. మాధవన్, భూమికలు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో చైతూ సరసన బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతోంది.