తెలంగాణ ఉద్యమకారుడి ఇంటికి జెపి..ఏ ప్రశ్నలు అడిగారంటే

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర వరంగల్ లో ముగిసింది. ఈ సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభ కు ముఖ్య అతిధిగా జెపి నడ్డా హాజరయ్యారు. మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకున్న ఆయన ..ఆ తర్వాత వరంగల్ కు చేరుకొని..ముందుగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ ఇంటికి వెళ్లారు. జేపీ నడ్డాతో బండి సంజయ్, బీజేపీ నాయకులు వెళ్లారు. ఈ సందర్భంగా వారు భేటీ అయిన విషయాలపై కూరపాటి వెంకటనారాయణతో నడ్డా ముచ్చటించారు.

ఈ సందర్బంగా నడ్డా ఏ విషయాలు అడిగారనేది వెంకటనారాయణ మీడియాకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు..? ఏ అభిప్రాయంతో ఉన్నారు ..? ప్రభుత్వంపై ఎందుకు వ్యతిరేకత ప్రారంభమైంది..? ఇతరత్రా విషయాలను నడ్డా తనను అడిగి తెలుసుకున్నారని కూరపాటి వెంకటనారాయణ చెప్పారు. సామాజిక న్యాయం లేకుండా పరిపాలన నడుస్తోందని, దీని నుంచి విముక్తి పొందాలని ప్రజలు అనుకుంటున్నట్లు జేపీ నడ్డాకు తెలియచేసినట్లు చెప్పారు. ప్రాంతీయ పార్టీల్లా ఏదో హామీలు ఇవ్వమని, ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని నడ్డాకు తనకు చెప్పారని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే విశ్వాసం జేపీ నడ్డాలో కనిపించిందన్నారు.