రజనీ పార్టీని అడ్డుకుని తీరతాం: సీమాన్‌

Rajanikanth
Rajanikanth


చెన్నై: ప్రముఖ సినీనటుడు రజనీకాంత్‌ రాజకీయాల్లో ప్రవేశించబోతున్నట్లుగా ప్రకటించిన నాటి నుంచి ఎవరో ఒకరు ఆయనను విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా సీమాన్‌ కూడా ఆయనపై విమర్శలు గుప్పించారు. రజనీకాంత్‌ రాజకీయ పార్టీ ప్రకటిస్తే దాన్ని తగిన విధంగా అడ్డుకుంటామని నామ్‌ తమిళర్‌ కట్చి సమన్వయకర్త సీమాన్‌ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని తమిళుడే పాలించాలని, ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తులను అందుకు అనుమతించబోమని సీమాన్‌ పలు సందర్భాల్లో తెలిపారు. ఈ నేపధ్యంలో కాంచీపురం జిల్లా సుంగువార్‌ సత్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీమాన్‌ మాట్లాడుతూ రజనీకాంత్‌ పార్టీ పెడతారని ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఆయన్ను అడ్డుకుంటామని పేర్కొన్నారు. తాను చదవకపోయినా, మిగిలిన వారు చదవాలని శ్రమించిన కామరాజన్‌ లాంటి నాయకుడు ఇప్పుడు ఉన్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్నాడీఎంకె, డిఎంకే వంటి పార్టీలను దూరం పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/telengana/