మ‌య‌న్మార్ బ‌హిష్కృత నాయ‌కురాలు అంగ్‌సాన్ సూకీకి జైలుశిక్ష

నైపిడావ్: మ‌య‌న్మార్‌కు చెందిన బ‌హిష్కృత నాయ‌కురాలు అంగ్‌సాన్ సూకీకి అక్క‌డి న్యాయ‌స్థానం నాలుగేండ్ల జైలుశిక్ష విధించింది. మిలిట‌రీకి వ్య‌తిరేకంగా అస‌మ్మ‌తిని రెచ్చ‌గొట్ట‌డం, స‌హ‌జ విప‌త్తుల చ‌ట్టంలోని కొవిడ్ నియ‌మాల‌ ఉల్లంఘన నేరం కింద ఆమెను దోషిగా తేల్చింది. మిలిట‌రీ ప్ర‌భుత్వం అంగ్‌సాన్ సూకీపై మొత్తం 11 కేసులు బనాయించింది. అయితే ఆ అభియోగాల‌న్ని అబ‌ద్దాల‌ని అంగ్‌సాన్ సూకీ కొట్టిపారేశారు.

గ‌త ఏడాది జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో అంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. అయితే, ఆ ఎన్నిక‌ల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ గ‌త ఫిబ్ర‌వ‌రిలో మిలిట‌రీ సైనిక తిరుగుబాటు చేసి పౌర ప్ర‌భుత్వాన్ని కూల్చేసింది. అప్ప‌టి నుంచి సూకీకి గృహ నిర్బంధం విధించారు. అమెపై ర‌క‌ర‌కాల అవినీతి అభియోగాలు మోపారు. కాగా, అమెపై న‌మోదైన అన్ని అభియోగాల్లో దోషిగా తేలితే సూకీకి వందేండ్ల‌కు పైగా శిక్ష ప‌డే అవ‌కాశం ఉన్న‌ది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/