అమెరికా జ‌ర్న‌లిస్టుకు 11 ఏళ్ల జైలుశిక్ష : మ‌య‌న్మార్

నెపితా: అమెరికాకు చెందిన జ‌ర్న‌లిస్టు డానీ ఫెన్‌స్ట‌ర్‌కు మ‌యన్మార్ సైనిక కోర్టు 11 ఏళ్ల జైలుశిక్ష‌ను విధించింది. ఇమ్మిగ్రేష‌న్ చ‌ట్టాల‌ను ఫెన్‌స్ట‌ర్ ఉల్లంఘించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌య‌న్మార్ సైన్యానికి వ్య‌తిరేకంగా అత‌ను నిర‌స‌న గ‌ళం విప్పిన‌ట్లు కూడా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దేశ‌ద్రోహం, ఉగ్ర‌వాదం కింద కూడా అత‌నిపై కేసు బుక్ చేశారు. అయితే కొత్త‌గా న‌మోదు అయిన ఫిర్యాదుల‌పై న‌వంబ‌ర్ 16న విచార‌ణ జ‌ర‌గ‌నున్న‌ది.

ఫ్రంటియ‌ర్ మ‌య‌న్మార్ ఆన్‌లైన్ ఎడిష‌న్‌కు ఫెన్‌స్ట‌ర్ మేనేజింగ్ ఎడిట‌ర్‌గా చేస్తున్నారు. మే నెల‌లో అత‌న్ని యంగూన్ విమానాశ్ర‌యం వ‌ద్ద అరెస్టు చేశారు. ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన సైనిక చ‌ర్య త‌ర్వాత మ‌య‌న్మార్‌లో అనేక మంది జ‌ర్న‌లిస్టుల‌ను అరెస్టు చేశారు. దాంట్లో 37 ఏళ్ల ఫెన్‌స్ట‌ర్ కూడా ఉన్నారు. గ‌తంలో మ‌య‌న్మార్ నౌకు ఫెన్‌స్ట‌ర్ ప‌నిచేశారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/