అఫిడవిట్‌ దాఖలు చేసిన మాయావతి

Mayawati statue
Mayawati statue

న్యూఢిల్లీ: బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత మాయావతి తన విగ్రహాల విషయంపై ఈరోజు సుప్రీంకోర్టులో సమర్థించుకున్నారు. ప్రజల అభీష్టం మేరకే ఆ విగ్రహాలు కట్టించానని ఆమె చెప్పారు. అయితే మాయావతి యూపీ సిఎంగా ఉన్న విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేశారు. బీఎస్పీ పార్టీకి చెందిన ఏనుగు గుర్తు విగ్ర‌హాల‌ను కూడా ల‌క్నోతో పాటు మ‌రికొన్ని న‌గ‌రాల్లో నిర్మించారు. అయితే ప్ర‌జాధానాన్ని దుర్వినియోగం చేశార‌ని మాయాపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆ కేసులో ఇవాళ సుప్రీం ముందు బీఎస్పీ నేత స్పందించారు. విగ్రహాల ఏర్పాటుకు అయిన ఖ‌ర్చును తిరిగి ప్ర‌జా ఖ‌జానాకు చెల్లించాల‌ని గ‌తంలో కోర్టు ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ సుప్రీం ముందు మాయా త‌న అఫిడ‌విట్‌ను దాఖ‌లు చేశారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/