ఆలోచించి మాట్లాడండన్న పవన్‌

Pawan Kalyan
Pawan Kalyan

అమరావతి: ఏపి ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడంపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విమర్శించిన విషయం తెలిసిందే. కాగా సమాధానంగా సిఎం జగన్‌ కూడా పవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో స్పందించి పవన్‌ ఓ ట్వీట్‌ చేశారు. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని ఆయన సూచించారు. ప్రభుత్వం విధానాల నిర్ణయంలో అందరి అభిప్రాయాలు వెలువరించే తరుణంలో అప్రమత్తంగా ఉండడం అవసరమన్నారు. నేతలకు, విద్యావంతులకు తాను విన్నపం చేస్తున్నానని, తమ విధివిధానాలుగా రూపాంతరం చెందుతాయని, అవి భవిష్యత్‌ తరాలపై ప్రభావం చూపుతాయని అందులో పేర్కొన్నారు. ఇంకా ఏ పని చేసినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నాని పేర్కొన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/