భారత్‌ టీమ్‌కు నా సహకారం ఉంటుంది: గంగూలీ

sourav ganguly
sourav ganguly

ముంబయి: తాను కోహ్లీకి అన్నివిధాలుగా సహకరిస్తానని భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ పేర్కొన్నారు. బుధవారం ఆయన బిసిసిఐ అక్ష్యక్షుడిగా బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా గంగూలీ మీడియాతో మాట్లాడుతూ క్రికెట్‌ కమిటీలు, సంఘాల్లోకి మాజీ క్రికెటర్లు రావడం శుభపరిణామమని అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం భారత జట్టు అద్భుతంగా రాణిస్తున్నదని, మంచి టీం ఉందని, విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నారని గంగూళీ కొనియాడారు. భారత క్రికెట్‌ చరిత్రలో మహేంద్రసింగ్‌ ధోనీది ప్రత్యేక స్థానమని గంగూలీ మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/