నా సెంచరీ పనికిరాకుండా పోయింది : సంజూ శాంసన్‌…

నా సెంచరీ పనికిరాకుండా పోయింది : సంజూ శాంసన్‌…
Sanju Samson. david warner

హైదరాబాద్‌: నాదైన రోజును నువ్వు నాశనం చేశావు డేవిడ్‌. నీ బ్యాటింగ్‌ ముందు నా సెంచరీ పనికిరాకుండా పోయింది. మీ ఇన్నింగ్స్‌ మొదలెట్టగానే పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ మా నుంచి చేజారిపోయంది. అయినా ప్రత్యర్థులుగా సన్‌రైజర్స్‌ వంటి పటిష్ట జట్టు ఉన్నప్పుడు మేము కనీసం 250 పరుగులు స్కోరు బోర్డు మీద ఉంచాల్సింది. అయినా నాకు ఇదొక ప్రత్యేకమైన రోజు అంటూ రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మెన్‌ సంజూ శాంసన్‌ సన్‌రైజర్స్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కాగా శుక్రవారం రాజస్తాన్‌ రాయల్స్‌పై సన్‌రైజర్స్‌ జట్టు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఉప్పల్‌ స్టేడియంలో జరిగి ఈమ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు రాజస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈమ్యాచ్‌లో సంజూ శాంసన్‌ సెంచరీ చేసినా వృథా అయ్యింది. ఈనేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం వార్నర్‌…సంజూను సరదాగా ఇంటర్వ్యూ చేయగా అతడు పైవిధంగా స్పందించాడు. ఇక ఓవరాల్‌గా ఐపిఎల్‌ చరిత్రలో ఇప్పటి వరకు 53 సెంచరీలు నమోదు కాగా సంజూ శాంసన్‌కిది రెండో సెంచరీ.


మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/sports/