సమర్థవంతమైన అభ్యర్థులను ఎన్నుకోవాలి

kishan reddy
kishan reddy

హైదరాబాద్‌: తెలంగాణలో మునిసిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి కోరారు. నేటి తెలంగాణ మునిసిపల్‌ ఎన్నికల్లో భారీ సంఖ్యలో పాల్గొని సమర్థవంతమైన అభ్యర్థులను ఎన్నకోవాలని ఓటరు మహాశయులందరికి నా సవినయ మనవి అని తెలిపారు. ప్రతి స్థాయిలో సుపరిపాలన, సమృద్ది కావాలనుకుంటే మీ ఆమూల్యమైన ఓటు ఎంతో అవసరం అని ప్రజలకు సుచిస్తూ కిషన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/