ముజఫర్‌ పూర్‌ దోషులకు జీవితఖైదు

శిక్ష విధించిన ఢిల్లీ కోర్టు

Brajesh Thakur sentenced to life imprisonment
Brajesh Thakur sentenced to life imprisonment

న్యూఢిల్లీ: బీహార్ లోని ముజఫర్ పూర్ వసతిగృహంలో బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన బ్రజేశ్ ఠాకూర్ కు ఢిల్లీ కోర్టు జీవితఖైదు విధించింది. ఈ కేసులో మరో 18 మందిని కూడా న్యాయస్థానం దోషులుగా తేల్చింది. వారిలో 11 మందికి జీవితఖైదు విధించారు. కాగా, బ్రజేశ్ ఠాకూర్ సహజరీతిలో మరణించేంత వరకు జీవితఖైదు విధిస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. యావత్ దేశం దిగ్భ్రాంతికి గురయ్యే రీతిలో ముజఫర్ పూర్ హాస్టల్లో 42 మంది బాలికలపై అత్యాచారం జరిగినట్టు 2018లో టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వెల్లడించింది. దీనిపై జరిగిన దర్యాప్తులో 34 మంది బాలికలపై లైంగిక దాడి జరిగినట్టు స్పష్టమైంది. దాంతో ఆ హాస్టల్ నిర్వాహకుడు బ్రజేశ్ ఠాకూర్ తో పాటు మరికొందరిపై అభియోగాలు నమోదు చేశారు. ఆపై ఈ కేసును సిబిఐకి అప్పగించారు. బ్రజేశ్ ఠాకూర్ బీహార్ పీపుల్స్ పార్టీకి చెందిన నేత.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/