ముత్తూట్‌ ఫైనాన్స్‌ ర్యాలీ

MUTHOOT FINANCE
MUTHOOT FINANCE

ముంబై: గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వాటాదారులకు మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించేందుకు ముత్తూట్‌ ఫైనాన్స్‌ బోర్డు ఈ నెల 5న సమావేశం కానుంది. అంతకుముందు ఏడాదిలో వాటాదారులకు షేరుకి రూ.10 చొప్పున డివిడెండ్‌ చెల్లించింది. శుక్రవారం నిర్వహించనున్న సమావేశంలో ప్రకటించే డివిడెండ్‌ చెల్లింపునకు ఈ నెల 13 రికార్డు డేట్‌గా కంపెనీ తాజాగా తెలిపింది. అయితే గతేడాది మూడవ త్రైమాసికంలో ముత్తూట్‌ పటిష్ట పనితీరు కనబరచింది. ఇవి కూడా ఈ షేరును జోష్‌లో దించాయి. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మూడవ త్రైమాసికంలో కంపెనీ నిర్వహణలోని ఆస్తుల విలువ 19 శాతం పెరిగి రూ.36.500కోట్లకు చేరింది. గృహ రుణాల విభాగం 67శాతం, మైక్రోఫైనాన్స్‌ బిజినెస్‌ 65శాతం చొప్పున పెరిగాయి.

మరిన్నీ తాజా బిజినెస్‌ జాతీయ వార్తల క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/business/