మాస్క్‌ తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు

మాస్క్‌ తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు
cm jagan

అమరావతి: ఏపిలో కరోనా మహమ్మారి తన పంజా విసురుతుంది. ఈనేపథ్యంలోనే బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలు, పని చేసే స్థలాలు, ప్రయాణ సమయంలో మాస్క్ కచ్చితంగా వినియోగించాలని ఏపి ప్రభుత్వ ఆదేశించింది. కాగా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బయటకు వచ్చే వారంతా మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/