వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి

1947 లోనే ముస్లింలను పాకిస్థాన్‌కు పంపించి ఉండాల్సింది

giriraj singh
giriraj singh

పాట్నా: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు, చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1947లోనే ముస్లింలందర్నీ పాకిస్థాన్‌కు పంపించి ఉండాల్సిందని గిరిరాజ్‌ సింగ్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక ముస్లిం దేశం ఏర్పాడాలంటూ 1947కు పూర్వమే జిన్నా ఒత్తిడి తెచ్చాడని గుర్తు చేశారు. దానికి మన పూర్వీకులు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు మనం మూల్యం చెల్లిస్తున్నామని అన్నారు. అప్పుడే కనుక ముస్లింలను పాకిస్థాన్‌కు పంపించి, అక్కడి హిందువులను ఇక్కడికి తీసుకొస్తే ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనే వారమే కాదని పేర్కొన్నారు. భారత వంశీయులకు భారత్‌లో ఆశ్రయం ఇవ్వకపోతే, ఇంకెక్కడిస్తారు, వారెక్కడికి వెళ్తారు? అని గిరిరాజ్‌ సింగ్‌ ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/