ప్రధాని మోడీకి ముస్లిం మహిళల రాఖీలు

MUSLIMS
MUSLIMS


వారణాసి : ట్రిపుల్‌తలాక్‌వంటి దురాచారానికి స్వస్తి చెప్పేవిధంగా తలాక్‌ చెప్పడాన్ని శిక్షార్హమైన నేరంగా చట్టం సవరించి ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణకు పాటుపడ్డారని పేర్కొంటూప్రధాని మోడీకి వారణాసి ముస్లిం మహిళలు తాము సొంతంగా తయారుచేసిన రాఖీలను పంపించారు. మోడీ తమకు పెద్దన్న లాంటివారని, శతాబ్దాలుగా కొనసాగుతున్న తమ మతంలోని దురాచారాన్ని రూపుమాపి తమకు ఎంతోమేలుచేసారని, తమ జీవి తాల్లో వెలుగులునింపారని అన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లురద్దుతోపాటు ముస్లిం మహిళల హక్కులపరిరక్షణ వివాహచట్టానికి చేసిన సవరణలపై ప్రధానిమోడీ నియోజకవర్గం అయిన వారణాసి ముస్లిం మహిళలు ఆయన్ను పెద్దన్నగా భావిస్తున్నారు. ఈసారి రాఖీ పండుగకోసం తాము సొంతంగా తయారుచేసిన రాఖీలను పంపించారు. రామ్‌పురాకు చెందిన హుమాబానో మాట్లాడుతూ కేవ లం మోడీ వల్లనే ట్రిపుల్‌తలాక్‌ శిక్షార్హమైన నేరంగా పరిగ ణించారని, ముస్లిం మహిళలందరికీ మోడీ పెద్దన్నలాంటివారని పేర్కొన్నారు. మా అన్నకోసమే మేం రాఖీలు తయారుచేసామని చెప్పారు. అయితే ఇండి యన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ మాత్రం ఇదంతా ప్రచార ప్రహసనమేనని కొట్టి వేసింది. ఆర్‌ ఎస్‌ఎస్‌లోని ముస్లింవిభాగం ఇలాంటి కార్యకలాపాలు చేస్తోందని, ముస్లింలను కిరాయికి తీసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, అది µకారంలో ఉన్న నేతల ఒత్తిడివల్లనే ఇలాచేస్తున్నారని, ఇది ప్రభుత్వ ప్రచారంలో భాగమేనని ఐఎంఎంఎల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మాతిన్‌ఖాన్‌ ఆరోపించారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/