ఎంఈఎస్‌ ముస్లిం ఎడ్యుకేషన్‌ సొసైటి సంచలన నిర్ణయం

burqa
burqa

త్రివేండ్రం: కేరళలోని ఎంఈఎస్‌ ముస్లిం ఎడ్యుకేషన్‌ సొసైటి సంచలన నిర్ణయం తీసుకుంది. కోజికోడ్‌ కేంద్రంగా ఎన్నో విద్యాసంస్థలను నిర్వహిస్తున్న ఎంఈఎస్‌ తమ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 150 విద్యాసంస్థల్లో విద్యార్ధులు ముసుగు ధరించరాదని ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దాదాపు లక్ష మంది విద్యార్దులు ముస్లిం ఎడ్యుకేషన్‌ సొసైటి విద్యాసంస్థల్లో చదువుతున్నారు.
తమ కళాశాలలకు, పాఠశాలలకు వచ్చే అమ్మాయిలు ముసుగులు ధరించటానికి, ముఖం కప్పుకోవడానికి వీలు లేదని ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. గతంలో కేవలం కొద్ది మంది మాత్రమే ముఖం కప్పుకునేవారని, ఇప్పడు ప్రతి ఒక్కరూ అదే విధంగా వస్తున్నారని, ఇది సరికాదని చెబుతూ, అమ్మాయిలు ఎవరూ ముఖం కప్పుకోరాదని ఆదేశాలు జారీ చేసింది. ఎంఈఎస్‌ ఆదేశాలపై సంప్రదాయ ముస్లిం కుటుంబాలు మండిపడుతున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: