మనసుకి ఉల్లాసాన్నిచ్చే సంగీతం
మనసుని ఉల్లాసంగా మార్చడానికి సంగీతం ఎంతో సాయపడుతుంది. కాస్త ఖాళీ దొరికితే నచ్చిన పాటల్ని పెట్టుకుని హాయిగా వినండి. అది ఇంట్లో కాదు. పచ్చని గడ్డిలో కూర్చుని వినగలిగితే మరింత తొందరగా ఒత్తిడిని ఉఫ్‌మని ఊదినట్లుగా పోగొట్టుకోవచ్చు. వ్యాయామం శరీరానికి హాయినస్తుంది. ఒత్తిడిని అదుపులో ఉంచుతుంది. కాసేపు నడకా, చిన్న చిన్న వ్యాయామాలు ప్రయత్నించి చూడాలి. అయితే ఇది రోజువారి జరిగినప్పుడే ఒత్తిడి సమస్య ఉండదని మరువకూడదు. ఈ కాలం మొక్కలు నాటాలనుకుంటే స్థలం లేకపోయినా సులువుగా పెంచుకునే గ్రోబ్యాగ్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని నాలుగైదు కొని నచ్చిన మొక్కలు నాటవచ్చు. కొంత సమయాన్ని వాటి మధ్య గడిపినా మెదడు ఉల్లాసంగా ఉంటుంది. ఖాళీగా ఉంటే మనసు రకరకాల ఆలోచనలు చుట్టముడతాయి. వాటిని వదిలేయకుండా ఓ చోట రాయాలి. అందులో సానుకూల ఆలోచనలన్నీ ఓ చోట, ప్రతికూల అంశాలన్నీ మరోచోట రాయాలి. శరీరాన్ని ప్రేమగా చూసుకోవాలి.
చక్కని సువాలసనలిచ్చే బాత్సాల్ట్స్తో స్నానం చేయాలి. తలకు నూనెతో మర్దనా, పాదాలకు స్సా చికిత్స వంటివన్నీ చేసుకోవాలి. శరీరంతో పాటు మెదడునికి తేలికపరుస్తాయి.
మనసునీ ఉల్లాసంగా ఉంచుతాయి. తీరిన లేని జీవితాలు ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తాయి.
అలాంటప్పుడు మనసుకి తగిన విశ్రాంతి ఇవ్వకపోతే మానసిక కుంగుబాటు తప్పదు. అందుకు సంగీతం బాగా తోడ్పడుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/