పోషకాల పుట్ట గొడుగులు

ఆహారం-ఆరోగ్యం

Mushroom- nutrients
Mushrooms- nutrients

పుట్టగొడుగుల్లో కేలరీలు, పిండి, కొవ్వు పదార్థాలు తక్కువ. ఇందులో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది.

ఇవి కొలెస్ట్రాల్‌ స్థాయులు అదుపులో ఉంచి గుండెనిఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు తాగ్గాలనుకునే వారు వీటిని తినడం మంచిది.

మష్రూమ్స్‌లో విటమిన్‌- సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని హాని కలిగించే ఫ్రీ రాడి కల్స్‌ను తొలగించడంలో సహాయ పడుతుంది. వీటిని తినడం వల్ల మధుమేహం మచ్చే ముప్పు తక్కువగా ఉంటుంది.

పొటాషియం, మెగ్నీయం ఖనిజాలు పుట్టగొడుగుల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును క్రమబద్దీకరించి, ఎముకలు బలంగా మారడానికి ఉపయోగపడతాయి.

ఇందులో సెలీనియం సమృద్ధిగా ఉండడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇది థైరాయిడ్‌ గ్రంథి పనితీరునూ మెరుగుపరుస్తుంది.

పుట్టగొడుగుల్లోని కాపర్‌ ఎర్ర రక్తకణాలు పెరగడానికి తోడ్పడుతుంది.రక్తప్రసరణ సమ్రంగా
జరిగేలా చూస్తుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/