బంగ్లాదేశ్‌లో మహిళల బాడీ బిల్డింగ్‌ పోటీలు

చాలా భిన్నంగా నిర్వహించిన నిర్వాహకులు

Bodybuilding contest for women
Bodybuilding contest for women

ఢాకా: బంగ్లాదేశ్‌లో తొలిసారి నిర్వహించిన జాతీయ బాడీబిల్డింగ్‌ ఛాంపియన్‌షిప్‌ను 19 ఏళ్ల స్టూడెంట్ కైవసం చేసుకుంది. అయితే, ఈ బాడీబిల్డింగ్‌ ఛాంపియన్‌షిప్‌‌లో పాల్గొన్న మహిళలు తమ కండలను కప్పిఉంచే దుస్తులను ధరించి పోటీల్లో పాల్గొనడం విశేషం. బంగ్లాదేశ్‌లో ముస్లింలు అత్యధికంగా ఉండటంతో ఈ బాడీబిల్డింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు వివాదం కాకుండా ఉండేందుకు ఈ పద్ధతిని పాటించినట్లు నిర్వహాకులు తెలిపారు. సాధారణంగా అంతర్జాతీయ బాడీబిల్డింగ్‌ పోటీల్లో పాల్గొనే బాడీ బిల్డర్లు బికీనీలు ధరించే సంగతి తెలిసిందే. కానీ ముస్లిం దేశమైన బంగ్లాదేశ్‌లో ఈ పోటీలు వివాదాస్పదం కాకుండా ఉండేందుకు పోటీల విజేత అహో నా రహ్మాన్‌ (19) సహా పాల్గొన్న 29మంది టైట్‌ లెగ్గింగ్‌లు వేసుకొని ఫొటోలకు పోజులిచ్చారు. రాజధాని ఢాకాలో గత ఆదివారం మూడు రోజుల పాటు ఈ పోటీలను నిర్వహించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/