కండరాలు పట్టేస్తుంటే ..

వ్యాయామం – ఆరోగ్యం


కండరాలు పట్టేయటం చాలా మందిలో కనిపించే సమస్య కండరాలు పట్టేస్తూ ఉంటే (మజిల్ క్యాంప్స్ ) శరీరానికి అవసరమైన పోషకాలు అందటం లేదని అర్ధం .. టెన్నిస్, స్విమ్మింగ్, వాకింగ్ చేసేటప్పుడు కండరాలు పట్టేస్తుంటాయి. అలా కాకుండా కొంతమందికి రాత్రిళ్ళు నిద్రలో కూడా పట్టివేస్తుంటాయి. .
కండరాలు పతీయటానికి కారణాలు , అలాగే డిహైడ్రషన్ ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవటం , శరీరంలో కాల్షియమ్ , పొటాషియం , సోడియం మెగ్నీషియం లవణాల శాతం కారణం కావచ్చు..
గర్బిణీలలో వెన్ను నరం పై ఒత్తిడి పడినప్పుడు , కిడ్నీ ఫెయిల్యూర్, హైఫో థైరాయిడిజం వంటి సందర్భాల్లో కూడా కండరాలు పట్టేసే వీలుంది.. కొందరిలో ఇతర జబ్బులులకు వాడే మందులు కారణం అవుతాయి.
కండరాలు పట్టేయటాన్ని దూరం చేసుకోవాలంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా మెగ్నీషియం లోపం లేకుండా జాగ్రత్త పడాలి.


వ్యాయామం చేసే ముందు వామాప్ చేయటం మరవద్దు. ఒకవేళ వ్యాయామం చేసే సమయంలో కండరం పట్టేస్తే నెమ్మదిగా మసాజ్ చేయాలి.
కెఫిన్ ఉన్న పానీయాలు దూరంగా ఉండాలి. కాఫీ, చాక్లేట్ వంటిని ఎక్కువ తీసుకోకూడదు. డీ హైడ్రేషన్ రాకుండా తరచుగా నీళ్లు తాగాలి.
పండ్లు , ఆకు కూరలు ఎక్కువుగా తీసుకోవాలి. సమస్య ఎక్కువ ఉంటే డాక్టర్ ను సంప్రదించి విటమిన్ మాత్రలు తీసుకోవాలి.
కొన్ని రకాల మందుల వాళ్ళ శరీరంలో మెగ్నీషియం , పొటాషియం లవణాల శాతం తగ్గిపోతుంది. మీరు రోజూ వాడుతున్న మందుల్లో అలాంటి మెడిసిన్ ఉన్నాయేమో డాక్టర్ ను అడిగి తెలుసుకోవాలి.

నాడి (ఆరోగ్యం ) వ్యాసాలకు: https://www.vaartha.com/specials/health1/