పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫ్యూచర్ ఫై మురళి మోహన్ ఆసక్తికర కామెంట్స్

చిత్రసీమ లో రాణించిన నటుడు మురళి మోహన్..బిజినెస్ లోను అగ్రగామి గా ఎదిగాడు. అంతే కాదు టీడీపీ పార్టీ లో కీలక నేతగా అందరి మన్నలను పొందిన ఈయన ..ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాగా తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ఆసక్తికర కామెంట్స్ చేసి అభిమానుల్లో , జనసేన కార్య కర్తల్లో , నేతల్లో జోష్ నింపారు. పవన్ కళ్యాణ్ ఏదో రోజు ముఖ్యమంత్రి కావడం ఖాయం అని అన్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..‘‘ప్రస్తుతం నేను యాక్టివ్ పాలిటిక్స్‌లో లేను.. ఏపీ పాలిటిక్స్‌పై నేను కామెంట్స్ చేయదల్చుకోలేదు. పవన్ కళ్యాణ్‌లో నాకు నచ్చిన అంశం ఏంటంటే.. కొంతమంది రాజకీయాల్లోకి వస్తారు.. వాళ్ల వల్ల కాకపోతే వెళ్లిపోతారు.. పవన్ కళ్యాణ్ అలా కాదు.. తను సక్సెస్ అయ్యినా అవ్వకపోయినా.. పార్టీని నమ్ముకుని.. కార్యకర్తలు తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుతున్నారు. ఏదో ఒకరోజు ఆయన మంచి స్థానానికి వెళ్తారు. తప్పుకుండా ముఖ్యమంత్రి అవుతాడు. ఎప్పుడనేది చెప్పలేను కానీ.. ఏదోరోజు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. అలా అయినరోజున మా సినిమా వాళ్ల నుంచి మరొకరు ముఖ్యమంత్రి అయ్యాడని గర్వపడతా ” అని తెలిపారు.

పవన్ కళ్యాణ్‌తో ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడలేదు కానీ.. నేను పోటీ చేసినప్పుడు బీజేపీ, జనసేన నాకు సపోర్ట్ చేశాయి. ఆ టైంలో నా తరుపున రాజమండ్రిలో ప్రచారం చేశాడు. అయితే చిరంజీవి బ్రదర్స్‌లో మిగిలిన వాళ్లతో ఉన్నంత క్లోజ్‌గా పవన్ కళ్యాణ్‌తో లేను. ఎప్పుడూ తన పని తాను చేసుకుని పోతాడు తప్పితే మిగిలిన విషయాలు పట్టించుకోరు. అదే చిరంజీవి అయితే ఆయన రియాక్షన్ వేరే విధంగా ఉంటుంది. సరదాగా ఫోన్ చేస్తే.. ఏంటన్నయ్యా.. ఏం చేస్తున్నావ్.. సరదాగా షూటింగ్‌కి రాకూడదు అని అంటారు. లంచ్ అక్కడ చేద్దాం అని అంటారు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. పవన్ కళ్యాణ్‌తో బాగున్నారా అంటే బాగున్నారా? అంతవరకే’’ అంటూ మురళి మోహన్ చెప్పుకొచ్చారు.