మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచే నామినేషన్లు షురూ

munugode Nomination will start from today

మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచి నామినేషన్లు షురూ కానుంది. తెలంగాణ వ్యాప్తంగానే కాదు దేశం మొత్తం కూడా ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక వైపు చూస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో టిఆర్ఎస్ , కాంగ్రెస్ , బిజెపి పార్టీ లు ఈ స్థానం ఫై ఫోకస్ పెట్టాయి. ఎలాగైనా ఈ ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని ట్రై చేస్తున్నారు . తాజాగా ఈ ఉప ఎన్నికకు సంబదించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుండి నామినేషన్ల పర్వం మొదలుకాబోతుంది.

ఈరోజు నుంచి 14వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. దీని కోసం చండూరులో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చండూరు తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు. స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జగన్నాథరావును రిటర్నింగ్‌ అధికారిగా నియమించారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్ కూడా అధికారులు ఏర్పాటు చేశారు.


నామినేషన్ల పరిశీలను అక్టోబరు 15న ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు అక్టోబరు 17 వరకు ఉంది. నవంబరు 3 తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నవంబరు 6న ఓట్ల లెక్కింపు మెుదలుపెట్టి.. అనంతరం విజేతను ప్రకటిస్తారు. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 10 నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 14న చివరి రోజు నామినేషన్ దాఖలు చేస్తారని సమాచారం. అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరుదాదాపు ఖరారైంది. అయితే నేడు సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆయన ఈ నెల 13 లేదా 14వ తేదీన నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.