ఫలితాల్లో నిజామాబాద్‌కు హంగ్‌

ఎంఐఎంకు మేయర్‌ పదవి దక్కేనా?

Nizamabad municipal election results
Nizamabad municipal election results

నిజామాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ఎస్‌ హవా కొనసాగించింది. అయితే నిజామాబాద్‌లో మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. నిజామాబాద్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మొత్తం 60 డివిజన్లు ఉన్న నగరంలో 24 స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. 18 స్థానాలు గెలుచుకున్న ఎంఐఎం రెండో స్థానంలో నిలవగా, టీఆర్ఎస్ 15 స్థానాలతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్‌కు రెండు స్థానాలు, ఇతరులకు ఒక స్థానం దక్కింది. దీంతో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పదవి టీఆర్ఎస్, ఎంఐఎం కూటమికి దక్కడం దాదాపుగా ఖరారైంది. అయితే మేయర్ పదవిని టీఆర్ఎస్ ఎంఐఎంకు వదిలిపెడుతుందా ? లేక తనకే మేయర్ పదవి కావాలని కోరుకుంటుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి గతంలో మాదిరిగానే ఎంఐఎంతో కలిసి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ దక్కించుకోనుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/