ధర్మవరంలో రాత్రికి రాత్రే కూరగాయల మార్కెట్ కూల్చివేత..

అనంతపురం జిల్లా ధర్మవరం కూరగాయల మార్కెట్ లో ఉద్రికత్త చోటుచేసుకుంది. కొత్త మార్కెట్‌లో దుకాణాల కోసం పది లక్షల రూపాయలు డిపాజిట్‌ చేయాలని మున్సిపల్‌ అధికారులు కోరారు. ఈమేరకు వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. దీంతో కొంతమంది డిపాజిట్‌ చేయలేదు. మరికొందరు దుకాణాలు ఖాళీ చేయలేదు. ఈ తరుణంలో ఆదివారం ఉదయం 40 దుకాణాలను జేసీబీ లతో అధికారులు కూల్చేయడం మొదలుపెట్టారు.

దీంతో మార్కెట్లో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు దుకాణాలకు సంబంధించి హైకోర్టు స్టే ఇవ్వడంతో వాటిని మాత్రం పక్కనపెట్టి మిగతా వాటిని తొలగించారు. మరోవైపు, తాము అంతమొత్తంలో డిపాజిట్ చెల్లించలేమంటూ వ్యాపారులు ఆందోళనకు దిగగా, టీడీపీ నేతలు వారికి మద్దతుగా నిరసన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వ్యాపారులతోపాటు ఆందోళనకు దిగిన టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు.